అలర్ట్ : కంటెంట్ లేదు.. కన్ఫూజన్ మాత్రమే

విజయ్ దేవరకొండ ‘పెళ్లి చూపులు’ సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. చిన్ని సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చిన పెళ్లి చూపులు పెద్ద విజయాన్ని నమోదు చేసింది. నిర్మాత రాజ్ కందుకూరికి భారీ లాభాలని తెచ్చిపెట్టింది. రాజ్ కందుకూరి నిర్మాతగా వ్యవహరించిన తాజా చిత్రం ‘మెంటల్ మదిలో’.. టీజర్, ట్రైలర్స్ తో ప్రేక్షకులని ఆకట్టుకొంది. సినిమాలోనూ ‘పెళ్లి చూపులు’ లాంటి కంటెంట్ ఉండొచ్చని ‘మెంటల్ మదిలో ‘ సినిమాకు వెఌతే షాక్ కొట్టిందని చెబుతున్నారు.

మీడియా మిత్రుల కోసం రెండు రోజుల క్రితమే ‘మెంటల్ మదిలో’ సినిమా స్పెషల్ షోని వేశారు. సినిమా చూసి కంటెంట్ లేదని.. కన్ఫూజన్ మాత్రమే ఉందని మీడియా మిత్రులు అప్పుడే చెప్పేశారు. ఇప్పుడు ప్రేక్షకులు అదే చెబుతున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో శ్రీవిష్ణు-నివేతా జంటగా తెరకెక్కిన ‘మెంటల్ మదిలో’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సినిమాలో హీరో శ్రీవిష్ణువికి కన్ఫ్యూజన్ ఎక్కువ. ప్రతి దానిని రెండు విధాలుగా ఆలోచిస్తుంటాడు. అయితే, సినిమా చూసినోళ్లకి అదే కన్ఫూజన్ ఏర్పడుతుందట. కథలో బలం లేకుండా.. కేవలం క్యారెక్టరైజేషన్ నమ్మి కొత్త దర్శకుడు వివేక్ ఈ సినిమాని తీసినట్టుగా ఉందని చెప్పుకొంటున్నారు.

ముందే ఈ కన్ఫూజన్’ని గుర్తించి మెంటల్ గా ప్రిపేర్ అయి.. ‘మెంటల్ మదిలో ‘ సినిమాకు వెళ్లాలని ఈ అలర్ట్ చేస్తున్నాం. ఆల్ ది బెస్ట్ ఫర్.