‘సైరా’లో పవన్.. కథని మలుపు తిప్పే రోల్ లో ?

మెగా అభిమానులు మురిసిపోయే న్యూస్ ఇది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా ‘సైరా నర్సింహారెడ్డి’ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 6 నుంది ‘సైరా’ని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. ఫస్ట్ షెడ్యూల్’లోనే యాక్షన్ సీన్స్ ని తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేసుకొన్నారు. హాలీవుడ్ ఫైట్ మాస్టర్స్ ఇప్పటికే ఫైట్స్ కంపోజ్ చేసి పెట్టుకొన్నారు. దాదాపు రూ. 200కోట్ల బడ్జెట్’తో తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ బాషల్లో సైరాని రిలీజ్ చేయనున్నారు.

మెగాస్టార్ చిరంజీవి సరసన నయన తార జతకట్టనుంది. బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి.. తదితరులు సైరాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక వీరిందరి కంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథని మలుపు తిప్పే పాత్రలో కనిపించబోతున్నాడట. పవన్ కనిపించేది కేవలం 10 నిమిషాల పాటే అయినా.. మొత్తం మలుపు తిప్పే రోల్ చెప్పుకొంటున్నారు. పవన్-చిరులని తెరపై చూసుకోవాలని ఆశపడుతున్న మెగా అభిమానులకి ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి.