మెట్రో రైలు టిక్కెట్ ధరలు ఇవే.. !

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఈ నెల 28న ప్రధాని మోదీ హైదరాబాద్ మెట్రో రైలును ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. ఎప్పుడెప్పుడు మెట్రోరైలు ఎక్కేద్దాం అంటూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు హైద్రాబాదీలు.

అయితే మెట్రో రాలు టికెట్ ధరలపై మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. కొద్దిరోజుల్లో మెట్రో రైలు ప్రారంభమవుతుండటంతో రైలు టికెట్ ధరలు ఖరారు చేసింది ఎల్ అండ్ టీ సంస్థ. కనీస టికెట్ ధర రూ. 10, గరిష్ఠ టికెట్ ధర రూ. 60 గా నిర్ణయించారు.

2 నుంచి 4 కి.మీ వరకు రూ.15
4 నుంచి 6 కి.మీ వరకు రూ.25
6 నుంచి 8 కి.మీ వరకు రూ.30
8 నుంచి 10 కి.మీ వరకు రూ.35
10 నుంచి 14 కి.మీ వరకు రూ.40
14 నుంచి 18 కి.మీ వరకు రూ.45
18 నుంచి 22 కి.మీ వరకు రూ.50
22 నుంచి 26 కి.మీ వరకు రూ.55

మొదటి స్టేజీ నుంచి చివరి స్టేజీ వరకు ప్రయాణిస్తే ధర రూ. 60 మొదటి రెండు స్టేషన్ల వరకు టికెట్ ధర రూ.10.