బాలీవుడ్’లో రాయ్ లక్ష్మీ హిట్టా.. ? ఫట్టా.. ??

తెలుగు తెరపై బీజీ కాలేకపోయింది రాయ్ లక్ష్మీ. చివరకు ఐటమ్ సాంగ్స్’తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆమె బాలీవుడ్’లో నటించిన తొలి చిత్రం ‘జూలీ 2’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. మరీ.. బాలీవుడ్ లో రాయ్ లక్ష్మీ తొలి అడుగు విజయవంతంగా పడిందా ? జూలీ2 పై బాలీవుడ్ ప్రేక్షకులు ఏమనుకుంటున్నారు ? అనేది ఆసక్తిగా మారింది.

దీపక్‌ శివ్‌దాసాని దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘జూలీ 2’లో ఇండస్ట్రీలోని చీకటి కోణాన్ని టచ్ చేశారు. అందుకు తగ్గట్టుగా హాట్ హాట్ సీన్స్ లో రాయ్ లక్ష్మీ ఒదిగిపోయి నటించింది. అయితే, దర్శకుడు కథపై కాకుండా, రాయ్ లక్ష్మీ గ్లామర్ ని ఫోకస్ చేసేందుకే శ్రద్ద చూపినట్టు కనబడుతోంది. మొత్తంగా.. జూలీ 2 యావరేజ్ సినిమాగా తేలినా.. రాయ్ లక్ష్మీ మాత్రం సూపర్ హిట్టయ్యిందని చెప్పుకొంటున్నారు. ఆమె బాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు రావొచ్చని చెప్పుకొంటున్నారు.