అందుకే ‘పద్మావతి’ని తిప్పి పంపారు

రాజ్ పుత్ కర్ణిసేన హెచ్చరికల నేపథ్యంలో డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన భన్సాలీ “పద్మావతి” వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇదీగాక, సెన్సార్‌ బోర్డు ‘పద్మావతి’కి సర్టిఫికెట్‌ ఇవ్వకుండా తిరిగి పంపింది. సర్టిఫికేషన్‌ కోసం పంపిన దరఖాస్తును పూర్తిగా పూరించలేదని.. దీంతో సర్టిఫికెట్‌ మంజూరు చేయలేదని సభ్యులు తెలిపారు. ఈ విషయం గురించి సెన్సార్‌ బోర్డు సీఈవో అనురాగ్‌ శ్రీవాస్తవ్‌ స్పష్టత ఇచ్చారు.

సినిమాను ఫిక్షన్‌ ఆధారంగా తీశారా? లేదా చరిత్ర ఆధారంగా తీశారా? అని దరఖాస్తులో ఉన్న ప్రశ్నకు నిర్మాతలు సమాధానాన్ని పూరించలేదు. దీన్ని అలాగే ఖాళీగా వదిలేశారని, సర్టిఫికేట్‌ ఇచ్చే సమయంలో నిర్మాతల జవాబు తెలుసుకోవడం తమకు అవసరమని, అందుకే సర్టిఫికెట్ ఇవ్వలేదని ఆయన తెలిపారు. ఇక, సినిమాలో
దీపికా పదుకొణె ‘పద్మావతి’ పాత్రలో, షాహిద్‌ కపూర్‌ పద్మావతి భర్త మహారావల్‌ రతన్‌ సింగ్‌ పాత్రలో, రణ్‌వీర్‌ సింగ్‌ రాజు అల్లా ఉద్దీన్‌ ఖిల్జీ పాత్రలో నటించారు.