టీ స‌వారీ వ‌చ్చేస్తోంది !

తెలంగాణ ప్ర‌జ‌ల ఇన్నాళ్ల క‌ల నెర‌వేర‌బోతోంది. ఈ టీస‌వారీ నెల‌లోనే ప‌ట్టాలెక్క‌బోతోంది.టీస‌వారీ ఏంటీ ప‌ట్టాలెక్క‌డ‌మేంటి అనుకుంటున్నారా..! అదేనండీ.. హైద‌రాబాద్ మెట్రో రైల్’ను ఈ నెల 28న ప్ర‌ధాని మోదీ ప్రారంభించే విష‌య‌మే మ‌నం చెప్పుకుంటున్నాం. మెట్రో టీ స‌వారీ అంటున్నారేంటి అనుకుంటున్నారా.. టెక్నాల‌జీ అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో యాప్ లేనిదే అడుగు ముందుకు వేయ‌డంలేదు క‌దా..! అందుకే మెట్రో రైల్ టైమింగ్… టికెట్ ధ‌ర, వివ‌రాలతో కూడిన ఒక యాప్’ను కూడా ప్రారంభోత్స‌వం రోజే ప్ర‌ధాని విడుదల చేయ‌నున్నారు.

ఈ నెల 29 నుంచే ప్రజలకు ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు ప్రజ‌లు మెట్రో సౌక‌ర్యాలు ఉప‌యోగించుకోవ‌చ్చని మంత్రి కేటీఆర్ చెబుతున్నారు. మెట్రోను న‌గ‌ర ప్ర‌జ‌లు త‌మ ఇంటిలాగే శుభ్రంగా ఉంచుకోవాల‌ని, ఇందుకు ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం అవ‌స‌ర‌మ‌ని కేటీఆర్ అన్నారు. మెట్రో ప్రయాణ అనుభూతి కోసం ప్రజా ప్రతినిధులను తిప్పాం. మన దగ్గర 57రైళ్లు ఉన్నాయని, ఒక్కో రైల్లో 3కోచ్’లు ఉటాయి. 1000 మంది ప్రయాణం చేయవచ్చని ఆయ‌న వివ‌రించారు. అంతేకాకుండా అవసరాన్ని, రద్దీని బట్టి 6 కోచ్’లకు పెంచుకుంటే 2000 మంది ప్రయాణం చేయవచ్చని చెప్పారు. మెబైల్ యాప్ టీ సవారీ పేరుతో తీసుకువ‌స్త‌న్నామ‌ని, దీంతో జర్నీ డిటైల్స్ తెలుస్తాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆ యాప్ ప్రధాని-కేసీఆర్ మెట్రో ప్రారంభం రోజున ఆవిస్కరిస్తారని ఆయ‌న టీస‌వారీ వివ‌రాలు వెల్ల‌డించారు.