ఇవాంకా ఉండేది ఈ గ‌దిలోనే.. !

గ‌త కొన్నాళ్లుగా ఇవాంకా పేరు అంత‌టామారుమోగిపోతోంది. ఇవాంకా ఎప్పుడు వ‌స్తారు, ఎక్క‌డెక్క‌డికి వెళ‌తారు అంటూ క‌థ‌నాలు వ‌స్తూనే ఉన్నాయి…తాజాగా ఇవాంకా ఉండే గ‌దిపై కూడా చ‌ర్చ‌మొద‌లైంది ఆమె బ‌స చేసే గ‌ది ఎలా ఉండ‌బోతుంది.. అందులో ఏయే సౌక‌ర్యాలుంటాయి అంటూ ఎవ‌రికి తోచిన విధంగా వారు మాట్లాడుకుంటున్నారు.

ప‌క్కా షెడ్యూల్ ప్ర‌కార‌మే ఇవాంకా అమెరికా నుంచి హైద‌రాబాద్ కు వ‌చ్చేస్తోంది. ఇప్ప‌టికే ప‌లువురు బిజినెస్ డెలిగేట్స్ హైద‌రాబాద్ చేరుకున్న నేప‌థ్యంలో ఇవాంకా కూడా మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజాముక‌ల్లా హైద‌రాబాద్ లో ల్యాండ్ అవుతున్నారు. జీఈఎస్ స‌ద‌స్సు సాయంత్రం ఉన్నా ఉద‌యానిక‌ల్లా భాగ్య‌న‌గ‌రిలో దిగిపోతున్నారు ఇవాంకా..

మంగ‌ళవారం ఉద‌యం 3గంట‌ల‌కే శంషాబాద్ కు చేరుకుంటారు. ఆ తరువాత ట్రైడెంట్ హోట‌ల్ కు 4గంట‌ల‌క‌ల్లా చేరుకుని అక్క‌డ త‌న‌కు ఏర్పాటు చేసిన గ‌దిలో ఉంటారు.సాయంత్రం 3గంట‌ల వ‌ర‌కు అక్క‌డే ఉండి సుష్మాస్వ‌రాజ్ తో భేటీ అవుతారు, ఆ తరువాత ప్ర‌ధాని మోదీతో అనంత‌రం షెడ్యూల్ ప్రకారం జీఈఎస్ స‌ద‌స్సులో పాల్గొని వివిధ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు