సినిమాల కోసం పవన్ కొత్త అకౌంట్ !

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇకపై రాజకీయాలని, సినిమాలని వేరు వేరుగా చూడాలని నిర్ణయించుకొన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పవన్ కొత్త ట్విట్టర్ అకౌంట్’ని ప్రారంభించారు. @pkcreativeworks పేరుతో మరో ట్విట్టర్ అకౌంట్ ను ఓపెన్ చేశారు. ఈ అకౌంట్ ను పూర్తిగా సినిమాలకు చెందిన విషయాలను వెల్లడించడానికే ఉపయోగించినున్నట్టు తెలిపారు పవన్. ఈ ఖాతా ద్వారా ఫస్ట్ ట్వీట్ చేస్తూ.. “తనకు ప్రేమను, శక్తిని ఇచ్చిన సినీ రంగానికి గౌరవాన్ని, ప్రేమను ఇవ్వాలనుకుంటున్నా. సమాజానికి మరింత మెరుగైన సేవ చేసేందుకు ఈ రంగాన్ని ఉపయోగించుకుంటా. ఈ కొత్త ట్విట్టర్ అకౌంట్ ను పూర్తిగా సినిమాల కోసమే ప్రారంభించా”నని తెలిపారు.

ఇప్పటికే @pawankalyan ట్విట్టర్ ఖాతా ద్వారా యాక్టివ్ గా ఉన్నారు పవన్. పర్సనల్, పార్టీకి సంబంధించిన విషయాలని మాత్రమే ప్రేక్షకులతో పంచుకొంటున్నారు. రాజకీయాలకు, సినిమాలకు సంబంధించిన విషయాలని ఒకే అకౌంట్ ఖాతా ద్వారా పంచుకోవడం పవన్ కు ఇష్టం లేదు. త్వరలో పవన్ పూర్తి స్థాయిలో పాలిటిక్స్ పై ఫోకస్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో.. సినిమా, పొలిటిక్స్ ని వేరు వేరుగా చూడాలనే సంకేతాలని పవన్ ఇచ్చాడని చెప్పుకొంటున్నారు. ప్రస్తుతం పవన్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘అజ్ఝాతవాసి’ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత పొలిటిక్స్ పై పూర్తిస్థాయిలో ఫోకస్ చేయనున్నాడని చెప్పుకొంటున్నారు. ఇంకేముంది.. పవన్ కొత్త అకౌంట్ @pkcreativeworks ఫాలో అయిపోండి.