అఖిల్ మళ్లీ పప్పులో కాలేశాడు !

విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని ‘హలో’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, టీజర్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇది పక్కా దర్శకుడు విక్రమ్ కుమార్ మార్క్ చిత్రమని చెబుతున్నారు. ఆయన గత సినిమాలు ఇష్క్, మనం, 24 రేంజ్’లో అఖిల్ ‘హలో’ ఉండనుందని టాక్. దీంతో అఖిల్ తొలి సినిమా ‘అఖిల్’ చేసిన డ్యామేజ్’ని ‘హలో’ దాదాపు కవర్ చేయబోతుందని ఫిల్మ్ నగర్ సమాచారమ్.

ఇదీగాక, అఖిల్ 3వ సినిమాని దర్శకుడు కొరటాల శివ చేసేందుకు అంగీకరించారు. కాకపోతే.. కొన్నాళ్లు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్’తో “భరత్ అను నేను” సినిమా చేస్తున్నాడు కొరటాల. ఆ తర్వాత స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. బన్నీ సినిమా పూర్తయ్యే వరకు కొరటాల కోసం అఖిల్ వెయిట్ చేయాల్సి ఉంటుంది.

ఇందుకు అఖిల్ రెడీగా లేనట్టు తెలుస్తోంది. ఈలోపు మరో దర్శకుడితో సినిమా చేయబోతున్నాడట. ఇదే నిజమైతే అఖిల్ మళ్లీ పప్పులో కాలేసినట్టేనని చెప్పుకొంటున్నారు. అఖిల్ తొలి అడుగు తప్పుగా పడింది. దాని సరి చేసేందుకు నాగార్జున అవస్థలు పడుతున్నాడు. ఇప్పుడు ఓటమెరగని కొరటాల సినిమా చేస్తానని అంగీకరించినా.. అందుకు కొన్నాళ్లు వెయిట్ చేయకపోవడం అఖిల్ మూర్ఖత్వమే అవుతుందని చెబుతున్నారు.