గ్రేట్ : కేటీఆర్ పక్కన నాని
యువత మంత్రి కేటీఆర్, హీరో నానిని రోల్ మోడల్’గా తీసుకొని ముందుకు సాగాలని వ్యక్తిత్వ నిపుణులు సూచిస్తున్నారు. ఇదే విషయాన్ని ఓ నెటిజెన్ మంత్రి కేటీఆర్’కు ట్వీట్ చేశాడు. దీనిపై మంత్రి స్పందిస్తూ హర్షం వ్యక్తం చేయడం విశేషం. “ఈ వ్యక్తిత్వ వికాస తరగతి ఎక్కడ జరిగిందో కానీ, తనను టచ్ చేసింది. వ్యక్తిత్వ వికాస నిపుణుడు చూపిస్తోన్న రెండో ఫొటోల్లో ఒకటి తానైతే తన పక్కన నాని కూడా ఉన్నాడు అంటూ నానికి ట్వీట్ పెట్టాడు కేటీఆర్”. దీనిపై నాని ‘సేమ్ హియర్ బ్రదర్’ అని స్పందించారు.
నేటి యువతకు కేటీఆర్ లాంటి రాజకీయ వేత్త పేరును విద్యావేత్తలు సూచించడం చాలా గొప్ప విశేషం. అందుకు కేటీఆర్ పూర్తి అర్హుడు కూడా. కేసీఆర్ తనయుడు అయినప్పటికీ ఆయన మిగితా రాజకీయ వారసుల్లా ఈజీగా వచ్చేసి ఎమ్మెల్యే, మంత్రి అవ్వలే. తెలంగాణ ఉద్యమంలో కొట్టాట, గిట్లాటలు జేసి ప్రజాభిమానం పొందాడు. కేటీఆర్ మంత్రి అయిన తర్వాత హైదరాబాద్ ప్రజల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంపై నమ్మకం తీసుకురావడంలో ఆయన సాధించిన గొప్ప విజయం. ఆ ఫలితంగానే జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ విజయఢంకా మ్రోగించింది.
మంత్రి కేటీఆర్ ని ముఖ్యమంత్రి కేసీఆర్ ని మించినోడు అని చెబుతుంటారు. అది నిజమే. నిరుద్యోగులు కేసీఆర్ ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారన్న విషయం వాస్తవం. ఆ విషయాన్ని గ్రహించిన కేటీఆర్ విద్యార్థుల్లో నమ్మకం కలిగించేలా త్వరలోనే లక్షాకుపైగా ఉద్యోగులని బర్తీ చేస్తామని మాటిచ్చాడు. అందుకు తగ్గట్టుగా సమాలోచనలు మొదలెట్టాడు. సొంతం ప్రభుత్వమైనా ఈ జిల్లాలో అభివృద్ది జరగలేదు. ప్రజాధనం వ్యర్థమైందని అధికారులని నిలదీసిన సందర్బాలు చాలానే ఉన్నాయి.
ఇక, నాచురల్ స్టార్ నాని కొత్తగా చెప్పేదేముంది. స్టార్ హీరోలు ఒక్క హిట్టు కొట్టేందుకు నానా అవస్థలు పడుతుంటే.. నాని మాత్రం వరుస హిట్స్ తో దూసుకెళ్తున్నాడు. యేడాదికి నాలుగైదు సినిమాలు. 3 నెలలకు ఓ సినిమా నాని నుంచి రావాల్సిందే. ఇన్నీ హిట్స్ పడుతున్న నానిలో కొంచెం గర్వం కూడా లేదు. ఎప్పటిలాగే బాబాయ్.. బాబాయ్ అంటూ అందరితో స్నేహంగా మెలగడం నాని ప్రత్యేకత.