మెట్రో రైలు ప్రారంభోత్స‌వ ప్రోటోకాల్ లిస్ట్ ఇదే

న‌గ‌రంలో రెండు పెద్ద ఈవెంట్స్ జ‌రుగుతున్నా న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ పేరును శిలాఫ‌ల‌కంపై చోటు లేకుండా చేయ‌డంతో పాటు, ప్రోటోకాల్ మార్చారంటూ అటు మీడియాలో , ఇటు సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ప్రోటోకాల్ లిస్టును అధికార‌లు బ‌య‌ట‌కు విడుద‌ల చేశారు. ఇప్ప‌టికే సొంత పార్టీ నేత‌ల‌తో పాటు ఇత‌ర నేత‌లు, ప్ర‌జ‌ల్లో ఈ అంశంపై చ‌ర్చ జ‌రుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వంపై త‌ప్పుడు సంకేతాలు వెళ‌తాయ‌నే ఈ లిస్టును అంద‌రికీ అందుబాటులో ఉంచార‌ట‌. ఆ లిస్టేంటో.. అందులో ఎవ‌రెవ‌రి పేర్లున్నాయో చూసేయండి మ‌రి…