అమెజాన్’లో రోబో ‘2.0’ చూడొచ్చు !

శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ రోబో ‘2.0’ తెరకెక్కింది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే యేడాది జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరిగిపోతున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే శాటిలైట్ రైట్స్’ను రూ.110 కోట్లకు జీ-ఎంటర్టైన్’మెంట్ గ్రూప్ దక్కించుకుంది. తాజాగా, ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ్ డిజిటల్ రైట్స్’ను ఫ్యాన్సీ రేటుకు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సొంతం చేసుకుంది.

రోబో 2.0 ట్రైల‌ర్ ను రజ‌నీకాంత్ పుట్టిన రోజైన డిసెంబ‌ర్ 12 వ తేదిన విడుద‌ల చేయ‌నున్నారు. దాదాపు రూ. 500కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న చిత్రమిది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, అక్షయ్ కుమార్ విలన్ గా కనిపించబోతున్నారు. ఎమీ జాక్సన్ హీరోయిన్. ఎఆర్ రెహమాన్ సంగీతం. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.