చరణ్, పవన్ సినిమాలకు థమన్

సంగీత దర్శకుడు ఎస్. థమన్ పంట పండింది. వరుసగా చరణ్, పవన్ సినిమా అవకాశాలని కొట్టేశాడు. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కనున్న రామ్ చరణ్ తదుపరి సినిమా కోసం సంగీత దర్శకుడిగా థమన్ ని ఫైనల్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి 151 ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా టీజర్ ని రెడీ చేసింది థమన్ నే. అప్పటికప్పుడు తీసుకొన్న నిర్ణయంతో చాలా తక్కువ టైంలో ‘సైరా’ టీజర్ ని రెడీ చేశారు. ఇక్కడ థమన్ స్వీడు చరణ్’కి నచ్చింది. ఆ సమయంలోనే తన తదుపరి సినిమాకు అవకాశం ఇస్తానని థమన్ కి మాటిచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం బోయపాటి సినిమాకి థమన్’ని తీసుకొన్నారు.

ఇదీగాక, పవన్ సినిమాకు థమన్ సంగీతం అందించబోతున్నాడు. పవన్-త్రివిక్రమ్-నితిన్’ల కలయికలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పవన్, త్రివిక్రమ్ లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నితిన్ స్వంత బ్యాన‌ర్ నిర్మాణ బాధ్య‌త‌లు చూస్తుంది. కృష్ణ చైత‌న్య దర్శకుడు. నితిన్-మేఘా ఆకాష్ జంటగా నటిస్తున్నారు. ఇప్పుడీ సినిమాని పవన్ సినిమాగానే చూస్తున్నారు. పిలుస్తున్నారు. ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే దాదాపు పని పూర్తయ్యిందని.. పాటలు అద్భుతంగా వచ్చాయని థమన్ చెబుతున్నాడు.