అనుష్క.. సరికొత్త లుక్’లో !

స్వీటీ అనుష్క సరికొత్త లుక్’లో కనిపించి షాకిచ్చింది. సైజ్ జీరో’ సినిమా కోసం స్వీటీ బరువు పెరిగి బండగా తయారైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బాహుబలి 2 కోసం సన్నబడటానికి చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలితం ఇవ్వలేకపోయింది. చివరికి టెక్నాలజీ సహాయంతో స్వీటిని సన్నగా చూపించారు. ఐతే, ఇప్పుడు స్వీటీ స్లిమ్ గా మారిపోయింది. మళ్లీ పాత సైజులు కనబడుతున్నాయి.

తాజాగా, తాను నాజుగ్గా మారానంటూ తన ఫొటోను ఆమె ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేసింది. కొత్త అందంతో, బాబ్డ్ హెయిర్ తో ఆమె సరికొత్తగా కనిపిస్తోంది. ‘మంత్ర, తంత్రాల ద్వారా కలలు నిజ రూపం దాల్చవు. అది సాధ్యం కావాలంటే చెమట చిందించాలి. కష్టించే తత్వం, పట్టుదల, దృఢ సంకల్పం అవసరం’ అని పేర్కొంది. అనుష్క నటించిన ‘భాగమతి’ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.