‘భాగమతి’కి బంపర్ రేటు

స్టార్ హీరోయిన్ అనుష్క లీడ్ రోల్’లో తెరకెక్కిన చిత్రం ‘భాగమతి’. జి. అశోక్‌ దర్శకుడు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. త్వరలోనే తెలుగు, తమిళ్’లోనూ ఏకకాలంలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరిగిపోతున్నట్టు సమాచారమ్. స్వీటీ కోలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్. దీంతో ‘భాగమతి’ మిళ వర్షన్ హక్కులని రూ. 15కోట్లకు స్టూడియో గ్రీన్‌ సొంతం చేసుకుంది. బాహుబలి తర్వాత అనుష్క నటించిన చిత్రం కావడంతో భాగమతి కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా తర్వాత అనుష్క గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనుంది. ఈ సినిమా తర్వాత సదాసీదా సినిమాలని చేయనని, తన రేంజ్ కి తగ్గ కథలు వస్తేనే నటిస్తానని స్వీటీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. వర్మ-నాగ్ ల కలయికలో తెరకెక్కుతోన్న ‘కంపెనీ’ సినిమా కోసం అనుష్కని సంప్రదించినట్టు తెలుస్తోంది.