హలో.. టీజర్ డిలీట్ ఎందుకు ?
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన అఖిల్ ‘హలో’ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘హలో’ టీజర్ ఆకట్టుకొంది. టీజర్’తో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఐతే, ఇప్పుడు ‘హలో’ టీజర్ యూట్యూబ్ లో కనబడటం లేదు. మొత్తానికి యుట్యూబ్ నుంచి టీజర్ తొలగించేశారు. దీంతో అక్కినేని అభిమానులు షాక్ కి గురవుతున్నారు.
కాపీరైట్ వివాదం కారణంగానే టీజర్ ని తొలగించినట్టు యూట్యూబ్ పేర్కొంది. యాడ్రెవ్ అనే థర్డ్ పార్టీ సంస్థ కాపీరైట్ క్లైయిమ్ చేయడంతో యూట్యూబ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. అయితే, దీనిపై చిత్రబృందం క్లారిటీ ఇస్తేనే అభిమానులు నెలకొన్న కన్ఫూజల్ క్లియర్ అయ్యేలా కనబడుతోంది.
ఈ సినిమాలో అఖిల్ సరసన కల్యాణి ప్రియదర్శన్ జతకట్టనుంది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం. అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్ప్రైజెస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది.