ఇవాంకా టూర్ కు బాంబు బెదిరింపు ? గోప్యంగా ఉంచిన పోలీసులు..?

ఇవాంకా, ప్ర‌ధాని మోదీ టూర్ కు టెర్ర‌రిస్టుల ముప్పు ఉంద‌ని ఇప్ప‌టికే ఇంటెలీజెన్స్ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని అలెర్ట్ చేసిన నేప‌థ్యంలో ఇవాంకా, మోదీ హైద‌రాబాద్ టూర్ కు పోలీసులు భారీ భ‌ద్రత ఏర్పాటు చేశారు. వంద‌లాదిమంది పోలీసుల‌తో భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. అయితేనేం స‌రిగ్గా నిన్న‌రాత్రి 9.46కి ఇవాంకా టూర్ కు బాంబు బెదిరింపు కాల్ వ‌చ్చింది. ఏకంగా డిజీపీ కంట్రోల్ రూంకు పోన్ చేసి బాంబు బెదిరింపులు చేశారు ఆగంత‌కులు.

ఫ‌ల‌క్నూమా ప‌రిస‌రాల్లో బాంబు పెట్టిన‌ట్టు బెదిరింపు కాల్స్ డీజీపీ కంట్రోల్ రూంకు కాల్స్ వ‌చ్చాయి. అయితే ఈ విష‌యాన్ని గోప్యంగా ఉంచిన పోలీసులు రాత్రంతా త‌నిఖీలు చేప‌ట్టారు. ప‌రిస‌ర ప్రాంతాల్లో పేలుడు ప‌దార్ధాలు ఏవీ డిటెక్ట్ కాక‌పోవ‌డంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇంటర్నెట్ వాయిస్ కాల్ ద్వారా కాల్ వ‌చ్చిన‌ట్లు పోలీసులు గుర్తించారు. బెరింపు కాల్స్ చేసిన వ్య‌క్తి ఎవ‌ర‌నేది గుర్తించే ప‌నిలో ప‌డ్డారు పోలీసులు..