చంద్రబాబుకు నో చెప్పిన ఇవాంకా ?!
ఓ వారం రోజులుగా హైదరాబాద్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, అధ్యక్షుడి సలహాదారు ఇవాంకా ట్రంప్’ను హైదరాబాద్ పర్యటనకు విచ్చేయడమే ఇందుకు కారణం. నిన్న హైదరాబాద్ లో జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో ఆమె పాల్గొన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ అద్భుత ప్రసంగం చేశారు. ‘ఇవంకా’ రాకతో హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన పబ్లిసిటీ దొరికినట్టయ్యింది.
సరిగ్గా దీనికోసమే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ట్రై చేశాడట. ఇవంకా ట్రంప్ ని సీఎం చంద్రబాబు ఏపీ రాజధాని అమెరికాకు ఆహ్వానించారంట. ఐతే, బాబుకు ఇవంకా నో చెప్పినట్టు తెలుస్తోంది. భద్రత కారణాలు, షెడ్యూల్’లో లేని కారణంగా ఆమె అంగీకరించలేదని తెలుస్తోంది. దీంతో ఇవాంకా ఏపీ పర్యటనకు ఒప్పుకొంటే తమ రాష్ట్ర ఇమేజ్ పెరిగి, అమెరికా నుంచి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ఆయన భావించిన చంద్రబాబుకు నిరాశే ఎదురైంది.