ఇవంకా @గోల్కొండ కోట.. !
జీఈఎస్ సదస్సుకు హాజరైన ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ పర్యాటక ప్రదేశాలలో ఒకటైన గోల్కొండ కోటను చుట్టి వచ్చారు. ఇవాంకా రాక సందర్బంగా గోల్కొండ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. ఆమె హైదరాబాద్ లో ఉన్న రెండు రోజుల వరకు పర్యాటకులను అనుమతించకపోవడంతో పాటు, గోల్కొండ కోటకు సెలవు ప్రకటించారు.
నిన్న జీఈఎస్ సమావేశం, పలక్ నూమా విందులో బిజీబిజీగా గడిపిన వివాంకా ఇవాళ గోల్కొండ కోటను సందర్శించారు. భారీ భద్రత నడుమ గోల్కొండ కోటకు వెళ్ళిన ఆమె కోటలో 46 నిమిషాలు గడిపారు. కోటలోని రామదాసు బంధీఖానాతో పాటు వివిధ కట్టడాలు, చారిత్రక విశేషాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. కోటను సందర్శించడానికి అధికారులు బ్యాటరీ కారును ఏర్పాటు చేసినా ఆమె ఆ కారును ఉపయోగించకుండా కాలినడకనే గోల్కొండ కోటను సందర్శించడం విశేషం.