‘ఒక్క క్షణం’ ఫస్ట్ లుక్

వి.ఐ ఆనంద్ దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా ‘ఒక్క క్షణం’ సినిమాని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. శిరీష్ సరసన సురభి, శీరత్ కపూర్ జతకట్టనున్నారు. ఇదో రొమాంటిక్ థ్రిల్లర్. ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’ తరహా విభిన్నమైన సినిమా అని చెబుతున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది చిత్రబృందం. శిరీష్ యాంగ్రీ యంగ్ మేన్ లుక్ ని ఫస్ట్ లుక్ గా వదిలారు.

ఈ సినిమాని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఐతే, డిసెంబర్ 21 నాని ‘ఎంసిఎ’, డిసెంబర్ 22న అఖిల్ హలో సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానుండటంతో శిరీష్ ‘ఒక్క క్షణం’ ఓ వారం ఆలస్యంగా అంటే.. డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ. చక్రి చిగురుపాటి నిర్మాత.