హానర్ 7ఎక్స్ ఫీచర్లు

హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ హానర్ 7ఎక్స్‌ను డిసెంబర్ 5వ తేదీన విడుదల చేయనుంది. ఈ ఫోన్‌లో 18:9 యాస్పెక్ట్ రేషియోతో కూడిన ఫుల్ వ్యూ డిస్‌ప్లే ఉంది. అలాగే వెనుక భాగంలో 16, 2 మెగాపిక్సల్ సామర్థ్యం ఉన్న రెండు పవర్‌ఫుల్ కెమెరాలను ఏర్పాటు చేశారు. 5.93 ఇంచ్ భారీ డిస్‌ప్లేను ఈ ఫోన్‌లో అందిస్తున్నారు.

హానర్ 7ఎక్స్ ఫీచర్లు :
* 5.93 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే
* 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్
* 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 7.0 నూగట్
* హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
* 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
* 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
* ఫింగర్‌ప్రింట్ సెన్సార్
* 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1 ఎల్‌ఈ
* 3340 ఎంఏహెచ్ బ్యాటరీ