మెట్రో క్రెడిట్ నాదే

హైదరాబాద్’లో అంగుళం అంగుళంలో జరిగిన అభివృద్ది తమ హయాంలో జరిగినదేనని చెప్పుకొంటుంటారు తెలుగు తమ్ముళ్లు. ఇప్పుడు హైదరాబాద్ విడిచి అమరావతికి వెళ్లిన పాత డబ్బా కొట్టడం మాత్రం మానడం లేదు. హైదరాబాద్ మెట్రో రైల్ క్రెడిట్’ని కూడా చంద్రబాబు ఖాతాలోనే వేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సరదాకి అంటూ పలు మెసేజ్ లు వైరల్ అవుతున్నాయి. తెలుగు తమ్ముళ్ల విషయం ప్రక్కన పెడితే.. స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ మెట్రో క్రెడిత్ నాదే అంటున్నారు.

బెంగళూరు, అహ్మదాబాద్‌ నగరాలకే కేంద్రం మెట్రోను పరిమితం చేస్తే.. తాను పట్టుబట్టి హైదరాబాద్‌ను ఆ జాబితాలో చేర్పించిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక, గుజరాత్‌ ప్రభుత్వాలు మెట్రోను వేగంగా పూర్తి చేశాయి. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మెట్రోను ఆలస్యం చేసినందుకే ఇంతకాలం పట్టిందని చెబుతున్నాడు.
హైదరాబాద్ మెట్రో, హెచ్‌ఐసీసీ వేదిక, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు ఇవన్నీ తెలుగుదేశం హయాంలో బీజం పోసుకున్నవే బాబు చెప్పుకొచ్చాడు.

ఎన్టీఆర్ హయాంలో బీజం పడిన పనులని చంద్రబాబు ప్రభుత్వం హయాంలో పూర్తి చేశారు. అలాగే.. చంద్రబాబు హయంలో బీజం పడిన పనులని కూడా ఆ తర్వాత ప్రభుత్వాలే కదా పూర్తి చేసింది. అలాగని.. వైఎస్ రాజశేఖర్ మాదిరిగా హైదరాబాద్ మెట్రో విషయంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయలేదు కదా. అలాంటపుడు మెట్రో క్రెడిట్ మొత్తం నువ్వే కొట్టేయాలని జూస్తే ఎట్ల బాబు.. అందులో కేసీఆర్ ప్రభుత్వానికి కొద్దిగా క్రెడిట్ ఇవ్వరాదె. గాయన ఇచ్చేదేందీ.. మనదే ఆ క్రెడిట్ అంటారేమో.. తెలంగాణ తమ్ముళ్లు… !