వెంకీ బావగా రాజశేఖర్ !

సీనియర్ హీరోలు విక్టరీ వెంకటేష్, రాజశేఖర్’లు బావబామ్మర్దిలుగా మారనున్నారు. తేజ దర్శకత్వంలో వెంకీ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వెంకీ పుట్టినరోజు డిసెంబర్ 13 సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. ‘బ్రేకింగ్‌ బ్యాడ్‌’ అనే టెలివిజన్‌ సిరీస్‌ ద్వారా స్ఫూర్తి పొంది ఈ కథని తేజ రాసుకొన్నాడాని చెబుతున్నారు. ఆటా నాదే వేటా నాదే, ఆటైనా పాటైనా టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి.

ఈ సినిమాలో వెంకటేష్’కి బావగా మరో కీలకమైన పాత్ర ఉందట. ఈ పాత్ర కోసం రాజశేఖర్’ను తీసుకున్నట్టుగా సమాచారమ్. ఇప్పటికే రాజశేఖర్ కు తేజ కథ చెప్పడం.. ఆయన అంగీకరించడం జరిగిపోయాయట. ఇదీగాక, ఈ సినిమాలో మరో యంగ్ హీరో కనిపించబోతున్నాడు. అది రానా, చైతూలలో ఒకరు కావొచ్చని చెబుతున్నారు. వెంకీ సరసన జతకట్టే హీరోయిన్ కోసం కాజల్, నిత్యామీనన్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి అనూప్ రుబెన్స్ సంగీతం. సురేశ్ ప్రొడక్షన్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.