ఇది మెగాస్టార్’ని అవమానించడమే.. !
మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నర్సింహారెడ్డి’గా రాబోతున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకుడు. రామ్ చరణ్ నిర్మాత. జాతీయ స్థాయిలో సినిమాని విడుదల చేయాలనే ఉద్దేశంతో.. దాదాపు రూ. 200కోట్ల భారీ బడ్జెట్ తో ‘సైరా’ని ప్లాన్ చేశారు. టెక్నీషియన్స్ విషయంలోనూ రాజీ పడటం లేదు. బాలీవుడ్, హాలీవుడ్ నుంచి టాప్ టెక్నాషియన్స్ ని తీసుకొంటున్నారు. ఈ క్రమంలోనే సంగీత దర్శకుడిగా ఏ.ఆర్.రెహ్మాన్ ను అనుకున్నారు. ఐతే, బిజీ షెడ్యూల్ కారణంగా మెగాస్టార్ సినిమాని చేయలేకపోతున్నానని ఇటీవలే రెహమాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజాగా, మలయాళంలో పృథ్వీరాజ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘ఆడు జీవితం’ సినిమాకు సంగీతం అందించేందుకు రెహమాన్ అంగీకరించారు. మెగాస్టార్ సినిమాకు సంగీతం అందించేందుకు డేట్స్ ఖాళీ లేవని చెప్పిన రెహమాన్ కు.. పృథ్వీరాజ్ సినిమాకు సంగీతాన్ని అందించేందుకు సమయం ఎలా దొరికింది. ఇప్పుడిదే విషయంపై టాలీవుడ్ లో హాట్ హాట్ చర్చ జరుగుతోంది. సైరా నుంచి రెహమాన్ తప్పుకోవడానికి మరేదో కారణం ఉండొచ్చనే గుసగుసలు వినబడతున్నాయి. వాటిపై మెగా ఫ్యామిలీ క్లారిటీ ఇస్తే బాగుంటుందేమో.. !