మళ్లీ టీఆర్టీ నోటిఫికేషన్..?
డీఎస్సీ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టులో చుక్కెదురవడంతో దిద్దుబాటు చర్యలపై దృష్టి సారించింది ప్రభుత్వ యంత్రాంగం. పది జిల్లాల ప్రకారమే టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని కోర్టు సూచించడంతో ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. ముప్పై జిల్లాల ప్రకారం కాకుండా పది జిల్లా ప్రకారం మళ్లీ నోటిఫికేషన్ జారీ చేస్తే ఎలా ఉంటుందన్నదానిపై అధికారులతో మాట్లాడి వారి అభిప్రాయాల్ని సేకరించే పనిలోపడ్డారు మంత్రి కడియం శ్రీహరి..
పదిజిల్లాల ప్రాతిపదికన మళ్లీ నోటిఫికెషన్ వేయాలని, ఇందుకు డిసెంబరు 31 వరకు గడువు విధించాలని ప్రభుత్వం భావిస్తోంది. మళ్లీ కోర్టులో చుక్కెదురు కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి లొసుగులు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. చూడాలి మరి ప్రభుత్వం టీఆర్టీ విషయంలో ఇంకెలా ముందుకు వెళుతోందో.