వెంకీ కోసం సీరియల్ కథ
తేజ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. వెంకీ బర్త్ డే డిసెంబర్ 13న సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. ఈ సినిమా కోసం ఆటైనా వేటైనా, ఆట నాదే వేట నాదే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. వెంకీకి జంటగా నిత్యామీనన్ జతకట్టనుంది. ఆ అవకాశం రానా, చైతూలలో ఒకరికి దక్కవచ్చని చెబుతున్నారు.
దర్శకుడు తేజ ఈ చిత్ర కథను ‘బ్రేకింగ్ బ్యాడ్’ అనే టెలివిజన్ సిరీస్ ద్వారా స్ఫూర్తి పొంది రాసుకొన్నాడని ఫిల్మ్ నగర్ సమాచారమ్. తెలుగు ప్రేక్షకులకు తగ్గట్లు పలు మార్పులు చేర్పులతో తనదైన శైలిలో తీర్చిదిద్దారని అంటున్నారు. ఈ చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్. సురేష్ ప్రొడక్షన్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.