ఇంద్రసేన.. ఏం అదరగొట్టలేదు !
‘బిచ్చగాడు’ సినిమాతో తమిళ్ స్టార్ విజయ్ ఆంటోని తెలుగులోనూ మంచి మార్కెట్ ఏర్పర్చుకొన్నాడు. బిచ్చగాడు తర్వాత విజయ్ నటించిన ‘బేతాళుడు’ తెలుగులో మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఆయన తాజా చిత్రం “ఇందసేన”. జి. శ్రీనివాసన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోని-డయానా చంపిక జంటగా తెరకెక్కిన చిత్రమిది. శుక్రవారం గోపీచంద్ ‘ఆక్సీజన్’తో పాటుగా విజయ్ ఆంటోని ఇంద్రసేన కూడా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరీ.. ఈ డబ్బింగ్ సినిమా ఏ మేరకు తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకోగలిగింది. అంటే..
ఒకేలా ఉండే ఇద్దరు అన్నదమ్ముల కథ ఇది. ఇంద్రసేన (విజయ్ ఆంటోని), రుద్రసేన (విజయ్ ఆంటోని) అన్నదమ్ములు. ప్రేమలో విఫ్లమై తాగుడుకి దగ్గరయిన పెద్దోడు ఇంద్రసేన చేయని తప్పుకు జైలుకెళ్లడం. ఆ తర్వాత చోటు చేసుకొనే పరిణామాల నేపథ్యంలో సినిమా సాగింది. డబుల్ రోల్ లో విజయ్ ఆంటోని నటన చాలా బాగుంది. అయితే, చెప్పే పాయింట్ ని సబ్ పాయింట్స్ గా తీసుకొని చెప్పడంతో.. కథ గ్రిప్పింగ్’గా అనిపించలేదు. మదర్ సెంటిమెంట్, బ్రదర్స్ సెంటిమెంట్, యాక్షన్ ఏపీసోడ్స్ ప్రేక్షకులని ఆకట్టుకొనేలా ఉన్నాయి. ఐతే, బిచ్చగాడు మాదిరిగా ఇంద్రసేన.. ఏం అదరగొట్టలేదు.