నిఖిల్ ‘కిర్ర్రక్ పార్టీ’ ఫస్ట్ లుక్

యంగ్ హీరో నిఖిల్ తాజా చిత్రం ‘కిర్రాక్ పార్టీ’ ఫస్ట్ లుక్ వచ్చేసింది. కన్నడ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ‘కిరాక్ పార్టీ’కి రీమేక్ ఇది. తెలుగులోనూ అదే టైటిల్ తో రాబోతుంది. శ‌ర‌ణ్ కొప్పిశెట్టి ద‌ర్శ‌కుడు. ఇతనికిదే తొలి సినిమా. ‘ఒరిజినల్ కిరాక్ పార్టీ’లో నటించిన సంయుక్త హెగ్డేను రీమేక్ లోకి కూడా తీసుకున్నారు.

ప్రస్తుతం కిర్రాక్ పార్టీ షూటింగ్ జెడ్ స్వీడుతో జరుగుతోంది. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తయ్యింది. ఈ చిత్రానికి నిఖిల్ తో ‘స్వామి రారా’ సినిమా చేసిన సుదీర్ వర్మ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. డైలాగ్స్ ‘కార్తికేయ’ దర్శకుడు చందూ మొండేటి రాసారు. ఈ చిత్తానికి రామబ్రహ్మం సుంకర నిర్మాత.