సంక్రాంతి గిఫ్ట్ రెడీ చేసిన చరణ్

నేతన్నతో కలిసి రామ్ చరణ్ ఉన్న ఓ స్టిల్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇది రామ్ చరణ్ తాజా చిత్రం ‘రంగస్థలం 1985’ సినిమా షూటింగ్ స్వాట్ కు సంబంధించినది. ఈ స్టిల్ ని మైత్రీ మూవీ మేక‌ర్స్ విడుద‌ల చేసింది. చేనేత కార్మికుడు చేతితో మగ్గం వేస్తుండగా.. ఆ పనిని దగ్గరుండి చూస్తున్నాడు రామ్ చరణ్. ఇప్పుడీ పిక్ ని చూసి మెగా అభిమానులు మురిసిపోతున్నారు.

గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న అచ్ఛమైన ప్రేమకథా చిత్రమిది. షూటింగ్ చివరిదశకి చేరుకుంది. ఈ సినిమాని మార్చి 16వ తేదీన సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణ‌యించింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని వచ్చే యేడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. దీంతోపాటు సంక్రాంతికి పవన్ ‘అజ్ఝాతవాసి’ సందడి చేయనుంది. ఇది మెగా అభిమానులకు డబుల్ దమాకే.