ఇగ రేష‌న్ కు డోఖా లేదు…

గ‌త‌కొంత కాలంగా స‌మ్మె కొన‌సాగింపు పై డైలామాలో ఉన్న రేషన్ డీల‌ర్లు ఓ క్లారిటీకి వ‌చ్చారు. సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ తో మెట్టుదిగివ‌చ్చి త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని విన్న‌వించుకున్నారు. సంబంధిత శాఖా మంత్రి ఈటెల రాజేంద‌ర్ ను క‌లిసి అన్ని జిల్లాల యూనియ‌న్ అధ్య‌క్ష, కార్య‌ద‌ర్శ‌లతో ఆదివారం సాయంత్రం స‌మావేశ‌మ‌య్యారు. రేష‌న్ డీల‌ర్ల స‌మ‌స్య‌ల‌పై సాయంత్రం 7.30 నుంచి 8.30వ‌ర‌కు గంట‌పాటు చ‌ర్చించారు.

మంత్ర ఈటెల నివాసంలో జ‌రిగిన ఈ అత్య‌వ‌స‌ర స‌మావేశంలో గ‌తంతో పోలిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ రేష‌న్ డీల‌ర్ల డిమాండ్లపై సానుకూలదృక్పథంతో ఉన్నార‌ని, పరిష్కరించడానికి సిద్దంగా ఉన్నారన ఈటెల స‌మావేశంలో వెల్ల‌డించారు. సమ్మె విరమించి ప్రభుత్వంతో సహకరించి డిమాండ్లను సాధించుకోవాలని ఆయ‌న తెలిపారు . త్వ‌ర‌లోనే ముఖ్యమంత్రితో ముఖాముఖీ సమావేశం ఏర్పాటుచేయిస్తామని వారికి హామీ ఇచ్చారు. దీంతో రేష‌న్ డీల‌ర్ల రాష్ట్ర కార్యవర్గం సమ్మెను విరమిస్తున్నట్లుగా ప్రకటించింది .