తెలంగాణ: టీచర్ పోస్టుల భర్తీకి కొత్త జీవో.. !
తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీకి న్యాయపరమైన అడ్డంకులు ఎదురవుతున్న నేపథ్యంలో ఇక ముందు ఇలాంటివి పరిణామాలు ఎదురవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని భావించింది. 31జిల్లాల ప్రాతిపదికన పోస్టుల భర్తీని సవాల్ చేస్తూ కొందరు కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే కోర్టు తీర్పు మేరకు పది జిల్లాల ప్రాతిపదికనే భర్తీ ప్రక్రియ చేపట్టాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది.
పది జిల్లాల ప్రాతిపదికన నియామకం చేపట్టేందుకు కొత్త నోటిఫికేషన్ వేస్తామని మంత్రి కడియం శ్రీహరి చెప్పారు. దీనికి సంబంధించి రోస్టర్ పాయింట్స్ ను కూడా రూపొందించామని, గతంలో ఇచ్చిన జీవో రద్దు చేసి కొత్త జీవో జారీ చేస్తున్నామన్నారు. విద్యార్థులు ఆందోళన చెందాల్సినవసరం లేదని చెప్పారు.
గతంలో వెనకబడిన జిల్లాలకు ఇబ్బంది రాకూడదని 31 జిల్లాలకు నోటిఫికేషన్ జారీ చేశామని, కానీ దానిని కోర్టు కొట్టివేసిందని అన్నారు. అందుకే కోర్టు తీర్పు అమలు చేస్తూ కొత్త జీఓ పది జిల్లాల ప్రాతిపదికన ఇస్తున్నామని ఆయన తెలిపారు.