టీజర్ టాక్ : ఒక్క క్షణం

‘ఎక్కడికిపోతావు చిన్నివాడా’ సంచలన విజయంతో దర్శకుడు వి.ఐ ఆనంద్ పేరు ఇండస్ట్రీ మారుమ్రోగిపోయింది. ఈ సినిమా తర్వాత స్టార్ హీరోలు ఆనంద్ తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపారు. స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ ఏకంగా తనకోసం ఓ కథని రెడీ చేయమని రిక్వెస్ట్ చేశాడు. ఐతే, ఆనంద్ మాత్రం అల్లు శిరీష్’తో ‘ఒక్క క్షణం’ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లారు. ఇదో రొమాంటిక్ థ్రిల్లర్. సురభి, శ్రీరత్ కపూర్ హీరోయిన్స్. ఇప్పుడీ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. రిలీజ్ కి రెడీగా ఉంది.

క్రిస్మస్ కానుకగా ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన శిరీష్ ‘ఒక్క క్షణం’ రేసులో నాని ‘ఎంసిఎ’, నిఖిల్ ‘హలో’ సినిమాలు ఉండటంతో వాయిదా పడక తప్పలేదు. ఇదిలావుండగా.. తాజాగా, ఈ సినిమా టీజర్’ని రిలీజ్ చేశారు. యాక్షన్, ఎమోషన్, రొమాన్స్ సంబంధించిన సీఅన్స్ ని టీజర్ గా కట్ చేశారు. ‘నేను ప్రేమించిన అమ్మాయి ప్రాణాల మీదకి వస్తే ఫేట్ తో నైనా .. డెస్టినీ తో నైనా .. చివరికి చావుతోనైనా పోరాడతాను’ అనే బాగా పేలింది. టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది. ఆ టీజర్ పై మీరు ఓ లుక్కేయండీ.. !