అఫీషియల్ : వెంకీ టైటిల్ ‘ఆట నాదే వేట నాదే’ !

విక్టరీ వెంకటేష్ ఈరోజు నుండే ఆటను మొదలెట్టనున్నాడు. తేజ దర్శకత్వంలో విక్టరీ వెంక‌టేష్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ‘ఆట నాదే వేట నాదే’, ‘ఆటైనా, వేటైనా’ టైటిల్స్ ని పరిశీలిస్తున్నట్టు వార్తలొచ్చాయి. వీటిలో ‘ఆట నాదే వేట నాదే’ అనే టైటిల్ ను ఖ‌రారు చేశారు. ఈ సినిమా నేడే ప్రారంభోత్సవం జరుపుకోనుంది.

మరికొద్ది సేపట్లో రామానాయుడు స్టూడియోలో సినిమాని ప్రారంభోత్సవం నిర్వ‌హించ‌నున్నారు. ఈ నెల రెండో వారం నుంచి రెగ్యూలర్ షూటింగ్ మొదవ్వనుంది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఇది తెరకెక్కుతుంది. ముందుగా ఈ సినిమాని డిసెంబర్ 13 వెంకీ బర్త్ డే కానుకగా ఈ సినిమాని ప్రారంభించాలని ప్లాన్ చేశారు. ఈ నిర్ణయాని సడెన్ గా మార్చుకొని ఈరోజే ప్రారంభించబోతున్నారు.

ఈ సినిమా కోసం హీరోయిన్స్ గా కాజల్, నిత్యామీనన్ పేర్లు వినబడుతున్నాయి. వెంకీతో పాటుగా మరో యంగ్ హీరో కనిపించబోతున్నాడని చెబుతున్నారు. రానా, చైతూలలో ఒకరు వెంకీతో తెరను పంచుకోనున్నట్టు చెబుతున్నారు. ఈ విషయాలపై ఈరోజు క్లారిటీ రానుంది.