అనుమ‌తులిచ్చినా అక్ర‌మ నిర్భంధాలా..?

తెలంగాణ వ్యాప్తంగా టీజేఏసీ నాయకులను, విద్యార్థి నాయకులను అర్ధరాత్రి దాటిన తరువాత పోలీసులు అరెస్టు చేశారు. కొలువులకై కొట్లాట సభకు కోర్టు ఆదేశాలు, పోలీసు అధికారిక అనుమతి ఉన్నప్ప‌టికీ అక్రమ నిర్బంధాలను టీజేఏసీ తీవ్రంగా ఖండిస్తుందని ప్రొఫెస‌ర్ కోదండ‌రాం అన్నారు. తక్షణం అరెస్టుచేసిన అందరినీ విడుదల చేయాలని టీజేఏసీ డిమాండ్ చేసింది.

ఓయూ హాస్టళ్లపై పోలీసులు అర్ధరాత్రి దాడిచేసి విద్యార్ధులను, పత్రికా విలేకరులను అమానుషంగా లాఠీలతో కొట్టడాన్ని కూడా టీజేఏసీ తీవ్రంగా ఖండించింది.అరెస్టు చేసిన విద్యార్థులను తక్షణం విడుదలచేయాల‌ని డిమాండ్ చేసింది. ప్ర‌భుత్వం ఎన్ని ఆటంకాలు సృష్టించినా కొలువులకై కొట్లాట సభ యధాతధంగా జరుగుతుందని కోదండ‌రాం చెప్పారు. సభకు పెద్దఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాల్సిందిగా తెలంగాణ యువతకు, ప్రజలకు విజ్ఞ‌ప్తి చేశారు.