హలో.. ఆడియో వేడుక ఎప్పుడు.. ఎక్కడ ?

అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని ఈ నెల 22న థియేటర్స్ లో ‘హలో’ చెప్పబోతున్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “హలో”. అఖిల్ సరసన కల్యాణి ప్రియదర్శన్ జతకట్టనుంది. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ సినిపై అంచనాలని పెంచేశాయి. ఇప్పుడీ సినిమా కోసం ప్రేక్షకులు, ఇండస్ట్రీ కూడా ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు.


రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్స్’ని వేగవంతం చేసింది చిత్రబృందం. ఈ క్రమంలోనే ఈ నెల 10న వైజాగ్’లో ‘హలో’ ఆడియో వేడుకని గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆడియో వేడుకకి సంబంధించిన పనులని మొదలెట్టినట్టు తెలుస్తోంది. ఆడియో వేడుక తర్వాత మిగిలిన మరో 10రోజుల సమయంలో అక్కిని ఫ్యామిలీ హలో కోసం స్పెషల్ ఇంటర్వ్యూలు ఇవ్వనుందని చెబుతున్నారు.

ఈ చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్. నాగార్జున నిర్మాత‌.