‘అజ్జాతవాసి’ టీజర్ డేటు

త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తోన్న పవన్ ‘అజ్ఝాతవాసి’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 10 ‘అజ్ఝాతవాసి’ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే అజ్ఝాతవాసి ఫీవర్ మొదలయ్యింది. అది అమెరికా వరకు పాకింది. అక్కడ ఏకంగా 209 ప్రాంతాల్లో అజ్ఝాతవాసి రిలీజ్ కాబోతోంది. బాహుబలి 2 కూడా ఈ రేంజ్ లో రిలీజ్ కాలేదు.

మరోవైపు, సినిమా ప్రమోషన్స్ లో వేగపెంచేందుకు చిత్రబృందం ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా ఈ నెల 9న ‘అజ్ఝాతవాసి’ టీజర్ ని, ఈ నెల 18న ఆడియో వేడుకని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసింది. ఆడియో వేడుక వేదికగా ట్రైలర్ ని రిలీజ్ చేయబోతుంది. టీజర్, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెరిగిపోయేలా త్రివిక్రమ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇదీగాక, పవన్-త్రివిక్రమ్’కు అస్సలు ప్రమోషన్స్ అవసరం లేదనే టాక్ కూడా వినిపిస్తోంది. కాకపోతే.. నిర్మాత సంతృప్తి కోసమైనా ప్రమోషన్స్ చేయకతప్పదేమో.. !

ఈ సినిమాలో పవర్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యూయేల్ లు జతకడుతున్నారు. పవన్ తో కలిసి నటించడం వీరిద్దరికి కూడా ఇదే తొలిసారి. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్. రాథాకృష్ణ నిర్మాత.