హైద‌రాబాద్: టిక్.. టిక్.. టిక్.. ఆ 48గంట‌లు..!!

బాబ్రీ మసీదు కూల్చివేసిన రోజు అయిన డిసెంబ‌ర్ 6న‌ బ్లాక్ డే సంధర్భంగా పాత బస్తీలో భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. మూడువేల ఐదు వందల మంది తో వివిధ విభాగాల పోలీస్ ఫోర్స్ తో నిఘా ఏర్పాటు చేశారు. సౌత్ జోన్ లో 60 సమస్యాత్మక ప్రాంతాలు , 10 అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను పోలీసులు గుర్తించారు.

ఇప్పటికే రెండు వర్గాలకు చెందిన 30 మంది అనుమానితులను , సమస్యాత్మకమైన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎక్కడో జరిగిన సంఘటన లు హైద‌రాబాద్ లో జరిగినట్లు సోషియల్ మీడియాలో క్రియేట్ చేస్తున్నారని, ఇలాంటి వార్తలు ఎవరైనా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తే కట్టిన చర్యలు తీసుకుంటామ‌ని పోలీసులు హెచ్చిరించారు.

హైద‌రాబాద్ లో 48 గంటలు పాటు 144 సెక్షన్ కొనసాగుతుందని చెప్పారు. సభలు , సమావేశాలు , ర్యాలీ లు , నిరసనలు చేస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామ‌ని పోలీసులు హెచ్చ‌రించారు. కేంద్ర బలగాలతో ప్రార్ధన మందిరాలు , మసీదులు , దర్గాలు , దేవాలయాలు వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేశామ‌ని చెప్పారు. ఉద్దేశ పూర్వకంగా రెచ్చేగొట్టే విధంగా వ్యవహరుస్తే సహించేది లేదని చెప్పారు సిటీపోలీస్..