రాజ్ న్యూస్.. దమ్మున్న ఛానెల్ అనిపించుకొంది !

తెలంగాణ రాష్ట్రంలో రెండు ఛానెల్స్ మాత్రమే దమున్న ఛానెల్స్ అనిపించుకొన్నాయి. రాజ్ న్యూస్, హెచ్ఎంటీవీ లు దమ్మున్న ఛానెల్స్ అంటూ సోషల్ మీడియాలో వేదికగా చర్చ సాగుతోంది. ఇటీవలే టీ-జేఏసీ నిర్వహించిన ‘కొలువుల కొట్లాట’ సభను ఈ రెండు ఛానెల్స్ మాత్రమే ప్రసారం చేయడం.. ఈ చర్చకు దారితీసింది. మిగితా ఛానెల్స్ ఏవీ కూడా ‘కొలువుల కొట్లాట’ సభని ప్రసారం చేయకపోవడం మీడియా పక్షపాత్రమేననే కామెంట్స్ వినిపిస్తున్నారు. ఇప్పుడీ న్యూస్’ని తెలంగాణ యువత వాట్సాప్, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేస్తోంది. దీంతో.. ఈ న్యూస్ వైరల్ అవుతోంది.

ఇప్పుడున్న న్యూస్ ఛానెల్స్ పార్టీలు, ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నాయనే ఆపవాదు ఉంది. ‘కొలువుల కొట్లాట’ సభతో.. ఇది నిజమని మరోసారి రుజువైంది. ఈ నెల 4న జరిగిన టీ-జేఏసీ ‘కొలువుల కొట్లాట’ సభను అడ్డుకొనేందుకు కేసీఆర్ ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. చివరికి కోర్టు తీర్పుతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆకాంక్ష నెరవేరలేదు. అదే సమయంలో ‘కొలువుల కొట్లాటకు’ లైన్ క్లియర్ అయ్యింది.

సరూర్ నగర్’లో ఇండోర్ స్టేడియంలో జరిగిన “కొలువుల కొట్లాట” సభకు విద్యార్థులు భారీ ఎత్తున హాజరై విజయవంతం చేశారు. ఈ సభ వేదికగా కేసీఆర్ ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు వెళ్లాయి. ‘లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పడం కాదు. క్యాలెండర్ ని రిలీజ్ చేయాలి. కొంత‌మంది తామే తెలంగాణ తెచ్చాము అని చెప్పుకుంటున్నార‌ని, తిరిగి రాని ప్రాణాల‌నే వ‌దులుకున్న అమ‌రుల‌కంటే కేసీఆర్ ది గొప్ప త్యాగ‌మేమీ కాద‌ని’ టీ-జేఏసీ ప్రొ. కోదండరాం అన్నారు. ఈ సభ విజయవంతం కావడంతో తమ లక్ష్యం నెరవేరిందని టీ-జేఏసీ చెప్పుకొంటోంది.