విరాట్ కోహ్లీ-అనుష్క శర్మల పెళ్లి.. పుకార్లే !
విరాట్ కోహ్లీ – అనుష్క శర్మలు చాన్నాళ్ల నుంచి ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లి డేటు ఫిక్సయ్యింది. ఈ నెలలోనే వీరి పెళ్లి జరగనుంది. ఇటలీలో పెళ్లి జరగనుంది. ఈ నెల 9 నుంచి 12వ తేది వరకూ ఇటలీలోని ప్రముఖ హోటల్ ను ఈ వివాహ వేడుక కోసం బుక్ చేశారు. ఇప్పటికే కోహ్లీ కుటుంబసభ్యులు, స్నేహితులు పెళ్లి కోసం టిక్కెట్లు కూడా బుక్ చేసేసుకున్నారంటూ ఓ వార్త నిన్న రాత్రి నుంచి చక్కర్లు కొడుతోంది.
ఐతే, ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదట. అవన్నీ వట్టి పుకార్లని అనుష్క శర్మ ప్రతినిధి మీడియాకు వెల్లడించారు. వీరి పెళ్లికి సంబంధించిన వార్తలు రావడం ఇది కొత్తేమీ కాదు. చాన్నాళ్ల నుంచి కోహ్లీ-అనుష్కల పెళ్లి వార్తలొస్తూనే ఉన్నాయి. త్వరలో కోహ్లీ క్రికెట్ నుంచి కొద్ది రోజులు రెస్ట్ తీసుకోనున్నాడనే వార్తలొచ్చాయి. పెళ్లి చేసుకొనేందుకు కోహ్లీ బీసీసీఐని రెస్ట్ కోరుతున్నాడని చెప్పుకొన్నారు. ఈ నేపథ్యంలో వచ్చిన పెళ్లి వార్తలు విని అవి నిజమే అనుకొన్నారంతా.