మాజీ డీజీపీ అనురాగ్ శర్మ కొత్త కొలువు..!

తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ‌లో డీజీపీ త‌న‌కంటూ ఓ ముద్ర వేసుకున్న వ్య‌క్తి అనురాగ్ శ‌ర్మ‌. కొద్ది రోజుల క్రితం ఆయ‌న ప‌ద‌వీ కాలం ముగియ‌డంతో కొత్త డీజీపీగా మ‌హేంద‌ర్ రెడ్డి నియ‌మితులైన విష‌యం తెలిసిందే. పోలీసింగ్ లో నూత‌న ఒర‌వ‌డితో ముందుకెళ్లి , డీజీపీగా ఒక బ్రాండ్ ఇమేజ్ ను సృష్టించుకున్న అనురాగ్ శ‌ర్మ సేవ‌లు అభినందించ త‌గిన‌వి.

అయితే డీజీపీగా రిటైర్డ్ అయినా ఆయ‌న సేవ‌ల‌ను వినియోగించుకుంటామ‌ని ప్ర‌భుత్వం గ‌తంలోనే స్ప‌ష్టం చేసింది. ఇత‌ర మాజీ అధికారుల‌ను కూడా ప్ర‌భుత్వంలో ఒక శాఖ‌కు స‌ల‌హాదారుగా నియ‌మించుకున్న విష‌యం తెలిసిందే. మాజీ డీజీపీ అనురాగ్ శ‌ర్మ‌ను కూడా లా అండ్ ఆర్డ‌ర్ తెలంగాణ ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా నియ‌మిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. బుధ‌వారం సాయంత్రం ఆయ‌న త‌న కొత్త‌కొలువులో చేరారు రిటైర్డ్ డీజీపీ అనురాగ్ శ‌ర్మ‌.