త‌ల‌సానిపై రేవంత్ స్ట్రాంగ్ పంచ్..!

రేవంత్ ఒక బ‌చ్చా.. పీక పిసికేస్తానంటూ మంత్రి త‌ల‌సాని రేవంత్ పై చేసిన కామెంట్స్ పై ఆయ‌న ఘాటుగా స్పందించారు. కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌లో పాల్గొన్న మంత్రి త‌ల‌సాని రేవంత్ రెడ్డి పై హాట్ కామెంట్స్ చేశారు. ఈ నేప‌థ్యంలో రేవంత్ కూడా త‌ల‌సాని వ్యాఖ్య‌ల‌పై అంతే ఘాటుగా స‌మాధాన‌మిచ్చారు.

త‌న పీక పిస‌క‌డం గొర్రెల మంత్రి త‌ల‌సాని వ‌ల్ల‌కాద‌ని, ఆయ‌న‌కు నౌక‌రు ఇచ్చిన కేసీఆర్ వ‌ల్ల కూడా కాద‌ని అన్నారు రేవంత్. క‌నీసం కొడంగ‌ల్ లో ప‌శువుల పేడ కూడా పిస‌క‌లేవంటూ ఎద్దేవా చేశారు. మీ య‌జ‌మాని రెండు పెగ్గులు ఏస్తే గానీ లేవ‌డు, నాలుగు వేస్తేగానీ నిల‌బ‌డ‌డు అంటూ విమ‌ర్శించారు. రేవంత్ రెడ్డి అంటే ఏంటో కేసీఆర్ ను అడిగితే చెబుతార‌ని అన్నారు. అధికార ప‌క్షం, రేవంత్ మాట‌ల‌తో కొడంగ‌ల్ రాజ‌కీయాలు వేడెక్కాయి.. నువ్వా, నేనా అంటూ త‌ల‌ప‌డే ప‌రిస్థితి నియోజ‌క‌వ‌ర్గంలో క‌నిపిస్తోంది..