గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
దేశం, ప్రపంచం దృష్టి గుజరాత్ ఎన్నికలపైనే పడింది. భాజాపా కంచుకోట, ప్రధాని నరేంద్రమోడి సొంత రాష్ట్రం గుజరాత్ ఫలితం ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ నెలకొంది. ఈ ఫలితం మూడున్నర యేళ్ల మోడీ ప్రభుత్వ పాలనకి ప్రొగ్రెస్ కార్డు కానుంది. ఈ ఫలితం ప్రతిపక్ష పార్టీలకు ఊపిరి కానుంది. ఇలాంటి నేపథ్యంలో జరుగుతున్న గుజరాత్ అసెంబ్లీ తొలిదశ ఎన్నికల పోలింగ్ కు సమయం ఆసన్నమయ్యింది.
గుజరాత్ అసెంబ్లీ తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ ప్రాంతాల్లో 89 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5గంటల వరకు జరుగనుంది. మొత్తం 89 స్థానాల్లో తొలివిడత ఎన్నికల బరిలో గుజరాత్ సీఎం విజయ్ రూపాని సహా 977 మంది అభ్యర్థులు బరిలో దిగారు. ఈ నెల 14న మిగిలిన స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 18న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది.