‘క్షణం’ అక్కడా.. హిట్టే !

అడ‌వి శేషు, ఆదాశ‌ర్మ‌, అన‌సూయ ప్ర‌ధానపాత్రలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘క్షణం’ సూపర్ హిట్. చిన్న సినిమాగా వచ్చిన ‘క్షణం’ పెద్ద విజయాన్ని అందుకొంది. ఇప్పుడీ సినిమా ఇతర బాషల్లో రిమేక్ అవుతోంది. తమిళ్’లో ప్ర‌ముఖ స్టార్ న‌టుడు స‌త్య‌రాజ్ కుమారుడు శిభి స‌త్య‌రాజ్ ను హీరోగా ప‌రిచ‌యం చేస్తూ ‘సత్య’గా రిమేక్ చేశారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘సత్య’ హిట్ టాక్ ని సొంతం చేసుకొంది.

ద‌ర్శ‌కుడు ప్ర‌దీప్ కృష్ణమూర్తి మాతృక “క్ష‌ణం”ను ఏ మాత్రం చెడ‌గొట్ట‌కుండా మంచి గ్రిప్పింగ్ తో మూవీని తీశాడ‌ని ప్ర‌శంస‌లు ల‌భిస్తుస్తున్నాయి. అక్కడ
అన‌సూయ పాత్ర‌లో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ న‌టించింది. నెగీటీవ్ షేడ్ ఉన్న ఇన్వెస్టిగేష‌న్ అధికారి పాత్ర‌లో మెప్పంచింద‌ని టాక్. శిబి స‌త్య‌రాజ్ కు తొలి సినిమానే అయినా బాగా నటించాడనే ప్రశంసలు వస్తున్నాయి. మొత్తానికి.. ‘క్షణం’ తమిళ్ లోనూ హిట్టే. మరి.. ఇంకెన్ని బాషల్లో ‘క్షణం’ హిట్ కొడుతుందో చూడాలి.