‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయ్‌’ స్టోరీ ఇదే !

శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో నాని – సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘ఎం.సి.ఎ’ (మిడిల్‌ క్లాస్‌ అబ్బాయ్‌). దిల్‌ రాజు నిర్మాత. క్రిస్మస్ కానుకగా ఈ నెల 21న విడుదల కానుంది. ఇప్పుడీ సినిమా స్టోరీ లైన్ లీకయ్యింది. వ‌దిన‌, మ‌రిది మ‌ధ్య ఉండే అప్యాయ‌త‌, అనుబంధాలు సినిమాకి హైలైట్’గా నిలుస్తాయని చెబుతున్నారు. వదినగా భూమిక, మరిదిగా నాని కనిపించబోతున్నారు.

ఇలాంటి సినిమా వచ్చి 20 సంవత్సరాలు అవుతోంది. ఈ యేడాది నేను లోకల్‌, నిన్నుకోరి తర్వాత వచ్చే ఎం.సి.ఎ నాని కెరీర్‌లో మరో విభిన్నమైన సినిమా అవుతుంది చెబుతున్నారు. తాజాగా, భూమిక‌తో విడుద‌ల చేసిన ‘ఎంసిఎ’ స్టిల్స్ అంద‌ర్ని ఆక‌ట్టుకుంటుంది. దాదాపు మూడేళ్ల తర్వాత తెలుగులో భూమిక రీ-ఎంట్రీ ఇస్తోంది.