‘టచ్ చేసి చూడు’ ఫస్ట్ లుక్

ఇటీవలే ‘రాజా ది గ్రేట్’ సినిమాతో సందడి చేశాడు మాస్ మహారాజ రవితేజ. తన రెండేళ్ల దాహాన్ని తీర్చుకొన్నాడు. సినిమాలో అంధుడి పాత్రలో అదరగొట్టాడు. విమర్శకుల ప్రశంసలు అందుకొన్నాడు. ఈ యేడాది రవితేజ సెట్స్ మీదకు తీసుకెళ్లిన మరో సినిమా ‘టచ్ చేసి చూడు’. విక్రమ్ సిరికొండ దర్శకుడు. రాశీఖ‌న్నా, శీర‌త్ క‌పూర్ లు హీరోయిన్స్. షూటింగ్ దాదాపు పూర్తికావొస్తోంది. వచ్చే యేదాది సంక్రాంతికి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈలోగా ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ రిలీజ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకి సంగీతం ప్రీత‌మ చ‌క్ర‌వ‌ర్తి. బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.