అఖిల్ భయపడుతున్నాడు.. !
అఖిల్ అక్కినేని ఈ నెల 22న థియేటర్స్ లో ‘హలో’ చెప్పబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు అఖిల్. ఫేస్ బుక్ లో తన అభిమానులతో లైవ్ ఛాట్ చేశాడు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పాడు. క్రికెటర్గా ఏ ఆటగాడి కథను రీమేక్ చేస్తారా ? అని ఓ అభిమాని అడగగా.. ఇప్పట్లో అలాంటి ప్రయత్నాలేవీ లేవు. అసలు తనకి రిమేక్ సినిమాలు అంటేనే భయమని సమాధానమిచ్చాడు.
ఇప్పుడు తన దృష్టంతా ‘హలో’పైనా. ఇతర విషయాలేవీ ఆలోచించడం లేదని చెప్పుకొచ్చాడు. దీన్ని బట్టి చూస్తే.. హలో రిలీజ్ కి ముందు అఖిల్ భయపడుతున్నట్టు కనబడుతోంది. ఇప్పటికే తొలి సినిమా ‘అఖిల్’తో ప్లాపు ఖాతాలో పడింది. రెండో సినిమా ‘హలో’లో అటు ఇటు అయితే ఏంటి పరిస్థితి ? అనే భయం అఖిల్ లో ఉన్నట్టు కనబడుతోంది. మొత్తానికి.. అఖిల్ భవిష్యత్ ‘హలో’పై ఆధారపడి ఉంది.