‘అజ్ఞాత‌వాసి’ కౌంట్’డౌన్ స్టార్ట్స్

పవన్ ‘అజ్ఝాతవాసి’ హవా మొదలైపోయింది. ఫస్ట్ లుక్, కీర్తి సురేష్ పవన్ ని ముద్దుచేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మరోవైపు, ఓవర్సీస్ లో రిలీజ్’కి ముందే ‘అజ్ఝాతవాసి’ దూకుడు చూపిస్తున్నాడు. యుఎస్’లో థియేటర్స్ దక్కించుకోవడంలో బాహుబలి, బాలీవుడ్ సినిమాల రికార్డ్స్ ని బద్దలు కొట్టింది. సాంగ్స్, టీజర్, ట్రైలర్ రాకముందే ‘అజ్ఝాతవాసి’ హవా ఈ రేంజ్’లో ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఇప్పుడు అజ్ఝాతవాసి రెండో సాంగ్’కి కౌంట్’డౌన్ స్టార్ట్ అయింది. ఈ నెల 12న రెండో సాంగ్ ‘గాలివాలుగా… ‘ను రిలీజ్ చేయనున్నారు. ఈ మేర‌కు కౌంట్ డౌన్ పోస్ట‌ర్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.. ఈ పోస్ట‌ర్ లో ప‌వ‌న్ తో పాటు సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ స్టిల్ వేయ‌డం విశేషం. ఇప్పటికే అజ్ఝాతవాసి హవా తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ లోనూ మొదలైపోయింది. పాటలు, టీజర్, ట్రైలర్స్ వస్తే.. అజ్ఝాతవాసి హవా ఆకాశన్నంటడం ఖాయం.