కళ్యాణ్ పక్కన అనుపమ

మెగాస్టార్ చిరంజీవి చిన్న‌ అల్లుడు కళ్యాణ్ హీరోగా ఎంట్రీకి రంగం సిద్ధమైంది. “జ‌త క‌లిసే” ద‌ర్శ‌కుడు రాకే్ష్ శ‌శి దర్శకత్వంలో కళ్యాణ్ సినిమా తెరకెక్కనుంది. కొర్ర‌పాటి సాయిని నిర్మాత‌గా వ్యవహరించనున్నారు. కళ్యాణ్ పక్కన హీరోయిన్’గా రాశీఖన్నా పేరు వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రానుంది.

గత కొన్నాళ్లుగా కళ్యాణ్ ఎంట్రీ సినిమా కోసం కోసం క‌థ‌ల అన్వేష‌ణ కొన‌సాగిస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు రాకే్ష్ శ‌శి రామ్ చరణ్ కోసం ఓ కథని వినిపించాడట. అది బావ కళ్యాణ్ ఎంట్రీ సినిమాని ఫర్ ఫెక్ట్ గా సరిపోతుందని ఆయనకి సెట్ చేశాడట. ఐతే, ఈ కథని ఫైన‌ల్ గా చిరంజీవి కూడా ఓకే చేశారు. దీంతో.. ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని చెబుతున్నారు.