వైరల్ : పవన్ పాటకు స్టెప్పులేసిన అనిరుధ్

సంగీత్ దర్శకుడు అనిరుధ్ ర‌విచంద‌ర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’కు మరో సప్రైజ్ ఇచ్చారు. పవన్ తాజా చిత్రం “అజ్ఝాతవాసి”కి అనిరుధ్ సంగీతం సమకూర్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి రెండో సాంగ్ ‘గాలి వాలుగా.. ‘ విడుదలయ్యింది. ఐతే, ఇదే పాటకు డ్యాన్స్ చేస్తూ.. ఆ వీడియోని పవన్ కళ్యాణ్ కు గిఫ్ట్ గా ఇచ్చాడు అనిరుధ్. ఇప్పుడీ సాంగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

‘ఎ ట్రిబ్యూట్ టు ప‌వ‌ర్‌స్టార్‌’ అంటూ ‘అజ్ఞాత‌వాసి’ చిత్రంలోని ‘గాలి వాలుగా..’ పాట‌కు స్టెప్పులు వేసి వీడియో రూపొందించాడు. అనిరుధ్ పాట‌ను పాడుతూ, డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ కనిపించాడు. ఈ వీడియో మీరు ఓ లుక్కేయండీ.. !