తేజు ప్రేమకథ మొదలయ్యింది !

ప్రేమకథల స్పెషలిస్టు కరుణాకరణ్ దర్శకత్వంలో మెగా యంగ్ హీరో సాయి ధరమ్ తేజు హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. తేజు సరసన అనుపమ పరమేశ్వరన్ జతకట్టనుంది. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ మంగళవారం శంషాబాద్‌లోని ఓ కాలేజ్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని కె.ఎస్‌.రామారావు నిర్మిస్తున్నారు.

దర్శకుడు కరుణాకరణ్ ‘తొలి ప్రేమ’తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’కు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు. స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ ‘హ్యాపీ’ చేశాడు. ప్రభాస్’ని ‘డార్లింగ్’ చేశాడు. ఇప్పుడు తేజుతో ఓ ప్రేమకథని మెదలెట్టాడు. ఇదో కలర్‌ ఫుల్‌ లవ్‌స్టోరీ చిత్రమని చెబుతున్నారు. ఫ్యామిలీ, సెంటిమెంట్స్‌, ఫ్రెండ్స్‌, ఎమోషన్స్‌ కలిసిన కలర్‌ ఫుల్‌ లవ్‌స్టోరీ తేజుకి హిట్ ఇస్తుందేమో చూడాలి. ఈ చిత్రానికి సంగీతం గోపీసుందర్‌.